ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న నిరసనలపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న నిరసనలపై.. ఇలా జరగడం మన దేశ దురదృష్టకరమని

Update: 2022-06-19 14:17 GMT

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వస్తున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దేశ పౌరుల సంక్షేమం కోసం చేపట్టిన అనేక పనులు రాజకీయ రంగులు పులుముకుంటున్నాయని.. మంచి ఉద్దేశ్యంతో చేపట్టిన నిర్ణయాలు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరగడం మన దేశ దురదృష్టకరమని అన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను పట్టించుకోమని, నవ భారతంలో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామని ప్రధాని మోదీ అన్నారు. దేశ రాజధానిలో నిర్మించిన 'ప్రగతి మైదాన్‌ సమీకృత రవాణా కారిడార్ ను ప్రధాని ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తొలిసారిగా జూన్ 19, ఆదివారం చెన్నైలో చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా, అంతర్జాతీయ చెస్ బాడీ, FIDE.. చెస్ ఒలింపియాడ్ టార్చ్‌ను ఏర్పాటు చేసింది. చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేను కలిగి ఉన్న మొట్టమొదటి దేశంగా భారతదేశం నిలిచింది. చెస్ ఒలింపియాడ్ కోసం మొట్టమొదటి టార్చ్ రిలే భారతదేశం నుండి ప్రారంభం కావడం చాలా ప్రోత్సాహకరంగా ఉందని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ ప్రకటించారు. టార్చ్ రిలే అన్ని ఖండాలలోకి వెళ్లే ముందు భారతదేశం నుండి ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. చెస్ కు సంబంధించిన భారతీయ మూలాలను మరింత ఎత్తుకు తీసుకువెళ్లబోతున్నామని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. FIDE ప్రెసిడెంట్ ఆర్కాడీ డ్వోర్కోవిచ్ టార్చ్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయగా, ఆయన దానిని గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు అందజేశారు. ఈ జ్యోతిని చెన్నై సమీపంలోని మహాబలిపురం వద్దకు చేరుకునే ముందు 40 రోజుల వ్యవధిలో 75 నగరాలకు తీసుకువెళతారు. ప్రతి ప్రదేశంలో, రాష్ట్రంలోని చెస్ గ్రాండ్‌మాస్టర్‌లు జ్యోతిని అందుకుంటారు. 44వ చెస్ ఒలింపియాడ్ చెన్నైలో జూలై 28 నుండి ఆగస్టు 10, 2022 వరకు జరుగుతుంది. 1927 నుండి నిర్వహించబడుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీ మొదటిసారిగా భారతదేశంలో, 30 సంవత్సరాల తర్వాత ఆసియాలో నిర్వహించనున్నారు.


Tags:    

Similar News