ముంబైలో సర్ఫరాజ్.. హై అలర్ట్
ముంబయిలో హై అలర్ట్ ను పోలీసులు ప్రకటించారు. ఉగ్రవాది సర్ఫరాజ్ మెమన్ ముంబైలో తిరుగుతున్నారని ఎన్ఐఏ సమాచారం ఇచ్చింది.
ముంబయిలో హై అలర్ట్ ను పోలీసులు ప్రకటించారు. పాక్ కు చెందిన ఉగ్రవాది సర్ఫరాజ్ మెమన్ ముంబైలో తిరుగుతున్నారని ఎన్ఐఏ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ముంబై పోలీసులతో పాటు అన్ని దర్యాప్తు సంస్థలకు ఎన్ఐఏ సమాచారం అందించింది. పాక్ ఉగ్రవాద సంస్థ వద్ద సర్పరాజ్ శిక్షణ తీసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. సర్ఫరాజ్ చాలా ప్రమాదకరమని ఎన్ఐఏ తెలిపింది.
ప్రమాదకారి అంటూ...
ఉగ్రవాది సర్ఫరాజ్ ఖాన్ కు సంబందించిన ఐడీ కార్డులను కూడా ఎన్ఐఏ పోలీసులతో పాటు వివిధ దర్యాప్తు సంస్థలకు పంపింది. సర్ఫరాజ్ ఖాన్ చైనా, పాక్ లో ప్రత్యేక శిక్షణ పొందాడని, చాలా ప్రమాదకరమని ఎన్ఐఏ పోలీసులు చెబుతున్నారు. దీంతో సర్ఫరాజ్ మెమన్ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలలో ఉగ్రవాది సర్ఫరాజ్ ఖాన్ దాడులు చేసే అవకాశముందన్న హెచ్చరికతో ముంబయిలో హై అలర్ట్ ప్రకటించారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సర్ఫరాజ్ మెమన్ పెను విధ్వంసం సృష్టించే అవకాశముందని ఎన్ఐఏ అధికారులు అందరినీ అలెర్ట్ చేశారు.