Loksabha Elections : ముగిసిన ఆరోవిడత పోలింగ్.. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

దేశంలో ఆరో విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి

Update: 2024-05-25 12:55 GMT

దేశంలో ఆరో విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. ఆరోవిడత పోలింగ్ లో మొత్తం 58 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో ఢిల్లీలోని ఏడు పార్లమెంటు నియోకవర్గాలు కూడా ఉన్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకూ 57.70 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా బెంగాల్ లో 77.78 శాతం పోలింగ్ నమోదయినట్లు తెలిసింది. ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

బెంగాల్ లో అత్యధికంగా...
ఢిల్లీలో 53 శాతం మాత్రమే పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ ఆరు విడతల్లో దేశ వ్యాప్తంగా పోలింగ్ ముగిసినట్లయింది. ఈ ఆరు విడతల్లో మొత్తం 486 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జూన్ 1వ తేదీన చివరి విడతగా ఎనిమిది రాష్ట్రాల్లో 57 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడానికి ప్రధాన కారణం వేసవి సెలవులో సొంతూళ్లకు వెళ్లడమే కారణమని చెబుతున్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


Tags:    

Similar News