ఆధిక్యంలో ప్రజ్వల్ రేవణ్ణ
సెక్స్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ
సెక్స్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈ ఎన్నికల ఫలితాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. హసన్ నుంచి బరిలోకి దిగిన ప్రజ్వల్ తన సమీప ప్రత్యర్థిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒకానొక దశలో దేశం విడిచి వెళ్లిపోయిన ఆయనను వెనక్కి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నించారు. రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేశారు. చివరికి బెంగళూరు చేరుకున్న ప్రజ్వల్‌ను విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
కర్ణాటక లోక్‌సభ ఎన్నికల 2024 ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) భారత జాతీయ కాంగ్రెస్ (INC) కంటే చాలా ముందంజలో ఉంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, జనతాదళ్ (సెక్యులర్) కేవలం మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.