అలా చేయలేము.. విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు.
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన పోటీ, తల్లిదండ్రుల ఒత్తిడే విద్యార్థుల బలవన్మరణాలకు ప్రధాన కారణమి న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే కోచింగ్ సెంటర్లను నియంత్రించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించడం విషయంలో.. సంజీవ్ ఖన్నా, ఎస్‌వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం నిస్సహాయత వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లను నియంత్రించేలా న్యాయవ్యవస్థ ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది.
కోచింగ్ సెంటర్లను నియంత్రించడం తేలికైన విషయం కాదని, ఇటువంటి సంఘటనలన్నింటి వెనక తల్లిదండ్రుల ఒత్తిడే అధికంగా ఉంటుందని అభిప్రాయపడింది. కోచింగ్ సెంటర్లు ఉండకూడదని చాలామంది కోరుకుంటారు. కానీ, పాఠశాలల్లో పరిస్థితులు, అక్కడ తీవ్రమైన పోటీ.. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఈ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. దేశంలో దాదాపు 8.2శాతం మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ఊటంకించారు. పిటిషనర్ ధర్మాసం ఈ పరిస్థితిపై తమకూ అవగాహన ఉందని, అయినప్పటికీ ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.