భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర

వంట గ్యాస్ ధర భారీగా తగ్గింది. కమర్షియల్ సిలిండర్ ధరను భారతాగా తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది

Update: 2022-06-01 04:33 GMT

వంట గ్యాస్ ధర భారీగా తగ్గింది. కమర్షియల్ సిలిండర్ ధరను భారతాగా తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాణిజ్య వంట గ్యాస్ ధర భారీగా ఇటీవల కాలంలో పెరగడంతో కొన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. ప్రధానంగా చిరు వ్యాపారులు, హోటళ్లు వంటి వాటికి ఇబ్బందికరంగా మారింది. ధరలను పెంచి వినియోగదారులపై కొందరు భారం మోపుతున్నారు. ఇటీవల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. రెండు వందల రాయితీని ప్రకటించింది.

నేటి నుంచే....
తాజాగా ఈరోజు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ఒక్కొక్క దానిపై రూ.135 రూపాయలు తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తగ్గించిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ఇది కొంత వరకూ ఊరట కల్గించే అంశమే. కమర్షియల్ సిలిండర్ ధర దేశంలో అత్యధికంగా చెన్నైలో ప్రస్తుతం 2,373 రూపాయలుగా ఉంది. గృహ వినియోగదారులకు కూడా ఊరట కల్గించాలన్న డిమాండ్ వినపడుతుంది.


Tags:    

Similar News