ఒమిక్రాన్ ను ఇలా ఎదుర్కొండి

ప్రధాని నరేంద్రమోదీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు.

Update: 2021-12-24 01:34 GMT

ప్రధాని నరేంద్రమోదీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. ఉన్నతాధికారుల సమీక్షలో మోదీ పరిస్థితులను బట్టి ఆ రాష్ట్రాలే నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ కట్టడితో పాటు కరోనా తీవ్రమయితే పరిస్థితులను అధిగమించడానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో బెడ్స్ సంఖ్యను పెంచడంతో పాటు, ఆక్సిజన్ నిల్వలను కూడా ఉంచుకోవాలని కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి.

కొన్ని రాష్ట్రాలు....
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఒమిక్రాన్ కట్టడికి కొన్ని చర్యలు ప్రారంభించాయి. మధ్యప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ ను అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. గుజరాత్ లో అయితే తొమ్మిది నగరాల్లో నైట్ కర్ఫ్యూ అమలువుతోంది. కర్ణాటక రాష్ట్రం కూడా సామూహిక వేడుకలను రద్దు చేసేసింది. ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు దేశ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది.


Tags:    

Similar News