కేదార్‌నాథ్ లో మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు కేదార్‌నాథ్ ఆలయాన్ని మోదీ దర్శించుకున్నారు

Update: 2022-10-21 04:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని మోదీ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాఖండ్ లో మోదీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాలను కూడా చేయనున్నారు.

రెండురోజుల పర్యటన...
దాదాపు 3,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకూ 9.7 కిలోమీటర్ల రోప్ వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బద్రీనాథ్ లో నదీ తీరం వెంట అభివృద్ధిని పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. మోదీ పర్యటన కోసం అధికారుల అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా భద్రతను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News