Narendra Modi : పోలండ్, ఉక్రెయిన్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. పోలండ్, ఉక్రెయిన్ దేశాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది.;

Update: 2024-08-21 05:53 GMT
narendra modi, prime minister, visakha, andhra pradesh
  • whatsapp icon

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఆయన విదేశాల్లో పర్యటించనన్నారు. పోలండ్, ఉక్రెయిన్ దేశాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. పోలండ్ చేరుకోనున్న పరధాని ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, ప్రధాని డొనాల్డ్ టస్క్ తో భేటీ కానున్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ నివాసం ఉంటున్న భారతీయులతో కూడా ప్రధాని నరేంద్ర మోదీ కాసేపు చర్చిస్తారు.

సుదీర్ఘకాలం తర్వాత...
అనంతరం ఉక్రెయిన్ బయలుదేరి వెళతారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తో సమావేశం అవుతారు. కీవ్ కు చేరుకుని అక్కడి పరిస్థితులపై చర్చిస్తారు. ఉక్రెయిన్ - రష్యా మధ్య రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతుంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ప్రధాని నరేంద్ర మోదీ తొలి సారి ఉక్రెయిన్ పర్యటనకు వెళుతున్నారు. అక్కడ శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు. పోలండ్ కు కూడా 45 తర్వాత వెళుతున్న భారత్ ప్రధానిగా మోదీ అక్కడకు వెళుతున్నారు.


Tags:    

Similar News