భారత్ లో ఎమెర్జెన్సీ ఒక మచ్చ

భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి వంటిది అని అన్నారు.

Update: 2022-06-26 13:58 GMT

భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి వంటిది అని అన్నారు. జర్మనీ మ్యూనిచ్ లో ప్రధాని మోదీ ప్రసంగించారు. జీ 7 సమ్మిట్ లో పాల్గొన్న ప్రధాని మోదీ తర్వాత ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. భారత్ సాధించాల్సిన లక్ష్యాల బాధ్యత పెద్దది అని మోదీ అన్నారు. గత శతాబ్దంలో భారత్ బానిసత్వంలో ఉందని మోదీ చెప్పారు.

భారత్ సాధించాల్సింది ఎంతో ఉంది...
మన ప్రజాస్వామ్యంలో ఎమెర్జెన్సీ ఒక మచ్చ అని మోదీ అన్నారు. కొత్తపారిశ్రామిక విధానానికి భారత్ శ్రీకారం చుట్టిందని ఆయన తెలిపారు. అందుకే పారిశ్రామిక విప్లవాల నుంచి ఎలాంటి ప్రయోజనాలను పొందలేదన్నారు. ప్రపంచం ప్రస్తుతం భారత్ వైపు చూస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యమే భారత్ బలమని మోదీ అన్నారు. విద్యుత్ సంస్కరణల దిశగా భారత్ అడుగులు వేస్తుందని మోదీ అన్నారు. రాబోయే కాలంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని మోదీ అన్నారు.


Tags:    

Similar News