ఈ విజయం కఠిన నిర్ణయాలకు నాంది

గుజరాత్ ప్రజల ఆశీర్వాదం వల్లనే మరోసారి గెలిచామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు

Update: 2022-12-08 14:09 GMT

గుజరాత్ ప్రజల ఆశీర్వాదం వల్లనే మరోసారి గెలిచామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో కార్కకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. గుజరాత్ ప్రజలకు రుణపడి ఉంటామని చెప్పారు. ఉపఎన్నికల్లోనూ బీజేపీకి విజయం లభించిందన్నారు. వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి కేంద్రంగానే రాజకీయాలు ఉంటాయని అన్నారు. యూపీ, బీహార్ బైపోల్స్ ఫలితాలు రానున్న ఎన్నికల ఫలితాలకు సంకేతాలని ఆయన అన్నారు. కొత్త ఆకాంక్షలకు ప్రతిబింబమే ఈ ఫలితాలని ఆయన అన్నారు. కుటుంబ రాజకీయాలు, అవినీతిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని మోదీ అన్నారు. ఈ విజయాలు కఠిన నిర్ణయాలకు నాంది పలుకుతాయని ఆయన అన్నారు. భూపేంద్ర, నరేంద్ర గతంలో నెలకొల్పిన రికార్డును ప్రజలు బద్దలు కొట్టారన్నారు.

కార్యకర్తల కష్టానికి ప్రతిఫలం...
బీజేపీ కార్యకర్తల కష్టానికి ప్రతిఫలం కనిపిస్తుందన్నారు. ప్రజాస్వామ్య పండగను ప్రజలు సంపూర్ణంగా జరుపుకున్నారన్నారు. ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగలేదన్నారు. బీజేపీని గెలపించడానికి హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ప్రయత్నించారన్నారు. గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి కూడా తామ కృషి చేస్తామని తెలిపారు. గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క పర్సెంటేజీ ఓట్లు తక్కువ వచ్చినా హిమాచల్ ప్రదేశ్ ఓటర్ల సమస్యల పరిష్కారానికి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఒక్క ఓటు శాతంతోనే హిమాచల్ ప్రదేశ్ లో ఓటమి పాలయ్యమన్నారు. బీజేపీ ప్రభుత్వం పనితీరు పట్ల యువత కూడా జై కొట్టిందన్నారు. కోటి మందికి పైగా యువత కమలం పార్టీకి అండగా నిలిచిందన్నారు. బీజేపీ ఈ స్థాయికి రావడానికి తరతరాల కృషి ఉందన్నారు. భారత్ లో వర్గానికైనా బీజేపీ కనిపిస్తుండటం సంతోషకరమని ఆయన వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News