సమ సమాజ నిర్మాణమే రామానుజార్య లక్ష్యం
ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్ లోని 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు
ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్ లోని 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. విశ్వక్సేనేష్టి యాగంలో మోదీ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన 108 దేవాలయాలు సందర్శించిన తర్వాత సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. వసంతపంచమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రామానుజాచార్యుల జ్ఞానాన్ని ప్రపంచ వ్యాప్తంగా పంచాలన్నారు. భారత సంస్కృతిలో గురువుని దేవుడిగా భావిస్తామని చెప్పారు. అది భారత దేశం గొప్పతనమని చెప్పారు.
108 దేశాల దివ్యదర్శనం....
ఈ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని మోదీ అన్నారు. రామానుజాచార్యుల సిద్ధాంతాలు, ఆశాయలు అందరూ ఆచరించాలని కోరారు. అప్పుడే సమసమాజం ఏర్పడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను 108 దివ్యదేశాల ఆలయాలను సందర్శించి వచ్చానని, భారత్ లో పర్యటించినట్లుందని అన్నారు. విష్వక్సేనేష్టి యాగంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. దేశ సంస్కృతిని ఈ సమతామూర్తి బలోపేతం చేస్తుందన్నారు. శ్రీరామనాజాచార్యులు విశిష్టద్వైతాన్ని ప్రవచించారన్నారు. మూఢ విశ్వాసాలను వెయ్యేళ్ల నాడే రామానుజాచార్యులు దూరం చేసే ప్రయత్నం చేశారన్నారు మోదీ. ఆనాడే దళితులను కలుపుకుని ముందుకు నడిచారన్నారు. ఆలయాల్లో దళితులకు దర్శన భాగ్యం కల్పించారన్నారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కూడా రామానుజా చార్యుల చెప్పిన విషయాలనే చెప్పారన్నారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
శ్రీరాముడిలా మోదీ కూడా....
ఈ సందర్బంగా చిన జీయర్ స్వామి మాట్లాడుతూ శ్రీరాముడిలా మోదీ కూడా గుణసంపన్నుడు అన్నారు. దసరా సమయంలో ఆయన అమెరికా వెళ్లినా వైదిక ధర్మానికి కట్టుబడి నిమ్మరసం తాగి ఉపవాసాలు ఉన్న విషయాన్ని చినజీయర్ స్వామి గుర్తు చేశారు. మోదీ ప్రధాని అయ్యాకే దేశ ప్రజలు హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారన్నారు. హైదరాబాద్ లో ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని చినజీయర్ స్వామి మనకు అందించారన్నారు. సర్వమానవ సౌభ్రాతృత్వం భారత దేశ లక్షణమని ఆయన తెలిపారు. సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత ఒక్క నరేంద్ర మోదీకే ఉందని చెప్పారు. అందరికీ సమానంగా చూడాలన్నదే మోదీ లక్ష్యమన్నారు. చిన జీయర్ స్వామి విద్యాసంస్థలను నిర్వహిస్తూ అనేక సేవలను అందిస్తున్నారని చెప్పారు. తెలుగు సినిమా ప్రపంచంలోనే ఘనత సాధించిందన్నారు. ఇక్కడ కళాకారుల నైపుణ్యం సిల్వర్ స్క్రీన్ నుంచి ఓటీటీ వరకూ విశ్వవ్యాప్తి అయిందని మోదీ అన్నారు.