నేడు 71వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు
నేడు దేశవ్యాప్తంగా 71వేలమందికి నియామకపత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అందిచనున్నారు.
నేడు దేశవ్యాప్తంగా 71వేలమందికి నియామకపత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అందిచనున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన రోజ్‌గార్ మేళా పథకంలో భాగంగా పది లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ పథకం కింద ఎంపికయిన ఉద్యోగులకు మోదీ స్వయంగా నియామకపత్రాలను అందించారు. ఈరోజు కూడా ప్రధాని నరేంద్ర మోదీ 71 వేల మంది కొత్తగా ఉద్యోగాలకు ఎంపికయిన వారికి నియామకపత్రాలను అందచేయనున్నారు.
వర్చువల్ గా ప్రసంగం...
ఈ సందర్భంగా అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చిన తర్వాత మోదీ ప్రసంగించనున్నారు. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి వర్చువల్ గా కొత్తగా ఉద్యోగాల్లో చేరబోయే వారితో మోదీ మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమాలకు దేశంలోని పలు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి సంబందించిన ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరవుతారు. ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే శాఖలో ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, టిక్కెట్ క్లర్క్ తో పాటు మరో పదిహేను పోస్టులకు ఎంపికైన వారికి సికింద్రాబాద్ రైల్ కళారంగ్ ఆడిటోరియంలో నియామకపత్రాలను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్‌లు హాజరుకానున్నారు.