కరోనా హై అలర్ట్: నేడు ప్రధాని హైలెవల్ మీటింగ్
కరోనా వైరస్ పై ప్రధాని నరేంద్ర మోదీ నేడు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకావముందని చెబుతున్నారు. చైనాలో ఇప్పటికే కరోనా వైరస్ డేంజర్ బెల్స్ ను మోగిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
ఉన్నతాధికారులతో...
ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యమైన శాఖల ఉన్నతాధికారులు పొల్గొననున్నారు. బీఎఫ్ 7 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని కోరింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు జరపే అత్యున్నత సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించనున్నారు.