Narendra Modi : నేడు జమ్మూలో ప్రధాని పర్యటన.. బాణా సంచా పేలుడుపై నిషేధం
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు జమ్ము లో పర్యటించనున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు జమ్ము లో పర్యటించనున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఈరోజు జమ్మూలో 13,375 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. జమ్మూలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతాపరమైన చర్యలు అన్ని తీసుకుంటున్నారు.
సాయంత్రం వరకూ...
బాణాసంచా పేలుడు వంటి వాటిపై కూడా నిషేధం విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధాని పర్యటన పూర్తయ్యేంతవరకూ ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకూ ఎటువంటి బాణసంచాలు కాల్చవద్దని ఆదేశాలు జారీ చేశారు. జమ్మూలో ఎయిమ్స్ ను నేడు ప్రధాని నేడు ప్రారంభించనున్నారు. బనిహాల్ - సంగల్దాన్ రైల్వే సెక్షన్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. జమ్మూ విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన టెర్మినల్ భవనానికి కూడా అయన శంకుస్థాపన చేయనున్నారు.