‍Narendra Modi : నేడు వారణాసికి మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు

Update: 2024-10-20 02:32 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటించనున్నారు. తాను ప్రాతినిధ్యం వహించే వారణాసి నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మొత్తం 6,100 కోట్ల పనులకు సంబంధించిన శంకుస్థాపనలను నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేయనున్నారు. ఈరోజు సాయంత్రం వారణాసిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

వివిధ అభివృద్ధి పనులకు...
దీంతో పాటు పాటు ఆర్‌జే శంకర్ కంటి ఆసుపత్రిని కూడా మోడీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ తన నియోజకవర్గంలో అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అనేక సార్లు పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వారణాసిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వివిధ పనులను చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు కూడా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటిస్తున్నారు. ప్రధాని వారణాసి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News