‍Narendra Modi : నేడు వయనాడ్ కు ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లో పర్యటించనున్నారు.;

Update: 2024-08-10 02:56 GMT
PM narendra modi vists wayand, kerala flooding
  • whatsapp icon

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లో పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీ కన్నూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి వాయనాడ్ లో కొండచరియలు విరిగిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ కొండచరియలు విరిగి పడిన ప్రాంతాన్ని సందర్శిస్తారు.

పునరావాస పనులను...
అక్కడ సహాయక శిబిరాలను, ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు. జరుగుతున్న సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. గత నెల 30వ తేదీన వాయనాడ్ లో కొండ చరియలు విరిగిపడి దాదాపు నాలుగు వందల మందికి పైగా మరణించారు. రెండు వందల మంది ఆచూకీ తెలియడం లేదు. దీంతో ప్రధాని వాయనాడ్ లో పర్యటించి అధికారులతో సమీక్ష జరుపుతారు.


Tags:    

Similar News