Vande Bharath Trains : గుడ్ న్యూస్.. నేటి నుంచే వందేభారత్ రైళ్లు

వందే భారత్ రైళ్లను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లకు పచ్చ జెండా ఊపుతారు

Update: 2024-09-16 02:35 GMT

vande bharat trains

వందే భారత్ రైళ్లను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్ లో ఒకేసారి దేశ వ్యాప్తంగా పది వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు ఉండటం విశేషం. ఇప్పటికే వందేభారత్ రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో వీటి సంఖ్యను రైల్వే శాఖ పెంచుకుంటూ పోతుంది.

మరో రెండు రైళ్లు...
ఇప్పటికే పలు రైళ్లు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండగా మరో రెండు కొత్త మార్గాల్లో వీటిని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఇందులో ఒకటి విశాఖ - దుర్గ్ కు, మరొకటి సికింద్రాబాద్ నుంచి నాగపూర్ కు మధ్య ఈ వందేభారత్ రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ అహ్మదాబాద్ లో వర్చువల్ గా ఒకేసారి పది రైళ్లను ప్రారంభించనున్నారు. ప్రయాణికులకు ఇక సుఖమైన, సౌకర్యవంతమైన అవకాశాన్ని కల్పిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Tags:    

Similar News