ఎన్నికల ముందు ప్రజలు గుర్తుకు వచ్చారు గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గింపు పై విపక్షాల సెటైర్

ఈ ఏడాది నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు గుర్తుకు వచ్చారని విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి

Update: 2023-08-30 14:07 GMT

ఎన్నికల ముందు ప్రజలు గుర్తుకు వచ్చారు

గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గింపు పై విపక్షాల సెటైర్

ఈ ఏడాది నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు గుర్తుకు వచ్చారని విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. దేశ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం రక్షాబంధన్‌, ఓనమ్ పండుగల‌ గిఫ్ట్నుగా వంట్యగ్యాస్‌ సిలిండర్‌ ధరను 2వందల రూపాయిలు తగ్గించింది. పెట్రోలు, డీజిల్ లపై కూడా కేంద్ర తగ్గింపు రేట్లను ప్రకటించనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిన్న (సోమవారం)ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. గ్యాస్‌ ధరను తగ్గించడంతో సామాన్యులపై భారం తగ్గుతుందన్నారు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్. కొత్తగా ఉజ్వల కింద ఇచ్చే 75 లక్షల కనెక్షన్లతో కలిపి దేశంలో 10 కోట్ల 35 లక్షల ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చింది. కేంద్రం ధరలను తగ్గించడంతో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం 955 అవుతుంది. ఉజ్వల స్కీము కింద లబ్ధిదారులకు 755 రూపాయలకే లభించనుంది. అంటే మరో 200 రూపాయలు అదనంగా తగ్గుతుంది.

2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ.410

20014లో గ్యాస్ సిలిండర్ ధర 410 రూపాయలుగా ఉంది. అప్పటి ముడి చమురు రేటు బ్యారల్ కు అత్యధికంగా ఉంది. అయినప్పటికీ యూపీఏ లోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై భారం వేయకుండా సబ్సిడీని ప్రకటించింది. వారి ఖాతాల్లో నేరుగా సబ్సిడీ మొత్తాన్ని జమచేసేది.

2023 నాటికి బీజేపీ ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్ ధర 1155 రూపాలకు పెరిగింది. అంటే బీజేపీ పాలనలో 745 రూపాయలు పెరిగిన గ్యాస్ ధరపై ప్రస్తుతం 200 రూపాయలు తగ్గించింది. ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లపై రూ.400 తగ్గించింది. బీజేపీ ప్రభుత్వంలో బ్యారెల్ ముడి చమురు రేటు గణనీయంగా తగ్గినప్పటికీ పెట్రోలు, గ్యాస్ రేట్లు మాత్రం తగ్గలేదు. సరికదా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రోజురోజుకు రేట్లు సవరించింది. 2021 వరకు ఇచ్చిన అరకొర సబ్సిడీని కూడా బీజేపీ ప్రభుత్వం 2022-23 ఆర్థిక బడ్జెట్ లో తొలగించింది.

కార్పొరేట్ల రుణమాఫీ

బీజేపీ ప్రభుత్వం ప్రజల నుంచి అదనంగా రాబట్టిన దాదాపు 17 లక్షల కోట్లరూపాయలను దేశంలోని వేళ్లపై లెక్కించదగిన కార్పొరేట్లకు బ్యాంకు రుణాలను మాఫీ చేయడానికి వెచ్చించిందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

Tags:    

Similar News