నేడు పంజాబ్ ఎన్నికలు

నేడు పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో మూడో విడత పోలింగ్ జరగనుంది.

Update: 2022-02-20 02:20 GMT

నేడు పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో మూడో విడత పోలింగ్ జరగనుంది. మూడో విడతలో మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు జరుగుతుంది. పోలింగ్ ఇప్పటికే ప్రారంభమయింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మూడో విడతలో ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న 59 స్థానాల్లో 627 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2.15 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ పోటీ చేస్తున్న జస్వంత్ నగర్ కు కూడా నేడు ఎన్నిక జరగనుంది. అఖిలేష్ యాదవ్ పోటీ చేసే కర్హల్ స్థానానికి కూడా నేడు ఎన్నిక జరగనుంది.

ఒకే దఫా....
ఇక పంజాబ్ లో మొత్తం స్థానాలకు ఒకే విడత ఎన్నికలు నేడు జరగనున్నాయి. మొత్తం 117 స్థానాలకు పంజాబ్ లో ఎన్నికలు జరగనుండటంతో పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 1,304 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు పెద్దయెత్తున ఓటర్లు తరలి వచ్చారు.


Tags:    

Similar News