నేడు పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన
పంజాబ్ సీఎం అభ్యర్థిని నేడు రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు. ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది
పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని నేడు రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు. అయితే ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పంజాబ్ ఎన్నికల వేళ రాహుల్ చేసే ప్రకటన కీలకంగా మారనుంది. కాంగ్రెస్ లో విభేదాలు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పంజాబ్ అసెంబ్లీకి ఈ నెల 20 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
ప్రకటిస్తే....?
అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ఉన్నారు. ఆయన పేరును మరోసారి ప్రకటిస్తే నవజ్యోత్ సింగ్ సిద్ధూ వర్గం ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే సిద్దూ హైకమాండ్ పై హార్ష్ కామెంట్స్ చేశారు. తమ మాట వినే వారినే హైకమాండ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తందని సిద్దూ అన్నారు. సిద్దూను కాకుండా చన్నీని పేరును ప్రకటిస్తే కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కుతాయని అంటున్నారు. సిద్దూ, చన్నీలతో మాట్లాడిన తర్వాతనే పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని రాహుల్ ప్రకటించే అవకాశాలున్నాయి.