ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ

ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. క్యూఆర్‌ కోడ్‌తో రైల్వే టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది;

Update: 2024-07-31 02:46 GMT
indian railways, good news, crucial decision, passengers
  • whatsapp icon

ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. క్యూఆర్‌ కోడ్‌తో రైల్వే టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రయాణికులకు రైల్వే శాఖ ఈ సౌకర్యం కల్పించింది. సాధారణ టిక్కెట్ల చెల్లింపు కోసం క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించవచ్చు అని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

అన్ని రైల్వేస్టేషన్లలో...
దీంతో పాటు రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్‌లో ఉద్యోగి నగదు లెక్కించేందుకు పట్టే సమయం కూడా ఆదా అవుతుందని తెలిపింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రజలు తక్కువ సమయంలో టిక్కెట్లను పొందేందుకు ఈ క్యూ ఆర్ కోడ్ ద్వారా అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే దేశంలోని అనేక రైల్వే స్టేషన్లలో ఈ సేవ ప్రారంభమైందని చెప్పింది.


Tags:    

Similar News