నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రైల్వే శాఖ ఎన్ని ఉద్యోగాలో?

దేశంలో నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది

Update: 2024-10-20 04:33 GMT

దేశంలో నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 25 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఉద్యోగాలన్నీ తాత్కలిక ప్రాతిపదికనే భర్తీచేయనున్నారు. వరస ప్రమాదాలతో పాటు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, ఇతర పేలుడు వస్తువులు లాంటి సామగ్రి పెడుతూ విధ్వంసానికి పాల్పడుతుండటంతో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి రైల్వే శాఖ ఈ ప్రకటన జారీ చేయనుంది. రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఉంటుంది.

ఉద్యోగ పరిమితి..
అయితే ఈ ఉద్యోగాలకు వయసు పరిమితి 65 ఏళ్లగా నిర్ణయించింది. రైల్వే బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎక్కువ మంది ఉపాధి పొందే అవకాశాలున్నాయి. రెండేళ్ల పాటు ఈ తాత్కాలిక ఉద్యోగంలో ఉండనున్నారు. వీరి సేవలను రైల్వే శాఖలోని వివిధ రంగాలలో వీరిని ఉపయోగించుకోనుంది రైల్వే శాఖ. అయితే వారు పనిచేసే తీరును బట్టి రెండేళ్ల తర్వాత కొనసాగించాలా? లేదా? అన్నది నిర్ణయిస్తుంది. అయితే రిటైర్ అయిన ఉద్యోగులకు పదవీ విరమణ చేసే ముందు ఆఖరిగా తీసుకున్న జీతాన్ని చెల్లించనున్నారు. వీరికి బేసిక్ పెన్షన్ డబ్బుల నుంచి మినహాయింపు ఇస్తారు. దీంతో మరికొంత కాలం రైల్వే శాఖలో పనిచేసే అవకాశం లభిస్తుంది.


Tags:    

Similar News