సీనియర్ సిటిజన్లకు రైళ్లలో రాయితీపై రైల్వేశాఖ క్లారిటీ

సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణంలో రాయితీ కల్పిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది;

Update: 2025-02-20 02:31 GMT
railway, clarifies, concessions, senior citizens
  • whatsapp icon

సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణంలో రాయితీ కల్పిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎటువంటి రాయితీ ప్రకటన రైల్వే శాఖ ఇవ్వలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని సూచించింది. కరోనా సమయంలో అన్ని రాయితీలను రైల్వే శాఖ తొలిగించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రైలు ఛార్జీల్లో అరవై ఏళ్లు నిండిన వారికి రాయితీ ఉండేది.

అది అబద్ధపు ప్రచారమే...
అయితే దానిని రైల్వే శాఖ కరోనా సమయంలో తొలిగించింది. కానీ కొద్ది రోజులుగా రాయితీని తిరిగి సీనియర్ సిటిజన్లకు పునరుద్ధరిస్తున్నట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. మొన్నటి బడ్జెట్ లోనూ దీని గురించి ప్రస్తావన ఉంటుందని ఆశించారు. కానీ అలాంటిదేమీ లేదు. కానీ సోషల్ మీడియాలో అదే పనిగా ప్రచారం జరుగుతుండటంతో అలాంటి వార్తలు నమ్మవద్దని, ఎవరికీ రైళ్లో రాయితీని ప్రకటించలేదని రైల్వే శాఖ తెలిపింది.


Tags:    

Similar News