ఆ వీడియో తీసి రాహుల్ గాంధీ తప్పు చేశారా?
పార్లమెంటు వెలుపల తనను అనుకరించినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై
పార్లమెంటు వెలుపల తనను అనుకరించినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ మంగళవారం మండిపడ్డారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి విపక్ష ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీలు నవ్వుతూ అనుకరిస్తూ ఉండగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మిమిక్రీని చిత్రీకరించారు. "ఒక ఎంపీ అవహేళన చేయడం సిగ్గుచేటు, హాస్యాస్పదమైనది, ఆమోదయోగ్యం కాదు. రెండో ఎంపీ ఆ సంఘటనను వీడియో తీస్తున్నారు" అని ధంఖర్ అన్నారు.
సస్పెన్షన్‌కు గురైన విపక్ష ఎంపీలు పార్లమెంట్ గేటు వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆ ఆందోళనలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్‌కర్‌ను అనుకరిస్తూ విమర్శలు చేశారు. మకర ద్వారం మెట్ల వద్ద అనేక మంది ఎంపీల మధ్య కూర్చున్న కళ్యాణ్ బెనర్జీ మాక్ పార్లమెంట్ నిర్వహించారు. చైర్మెన్ జగదీప్ ధన్‌కర్‌ను కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న రాహుల్ గాంధీ.. తృణమూల్ నేతను వీడియో తీశారు. నా వెన్నుపూస నిటారుగా ఉంది, నేను చాలా పొడుగ్గా ఉన్నానంటూ రాజ్యసభ చైర్మెన్‌ను విమర్శిస్తూ వెక్కిరించారు.