బెంగళూరులో బాంబు పెట్టాక అతడు వెళ్ళింది ఆ ఊరికే!!

రామేశ్వరం కేఫ్‌ పేలుడుపై దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ

Update: 2024-03-07 14:22 GMT

రామేశ్వరం కేఫ్‌ పేలుడుపై దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అనుమానాస్పద బాంబర్ బెంగళూరు నుండి బళ్లారికి వెళ్లాడని.. అక్కడి నుంచి గోకర్ణకు వెళ్లే మరో బస్సు ఎక్కినట్లు తెలిసింది. ఎన్‌ఐఏ అధికారులు బుధవారం బళ్లారిని సందర్శించి జిల్లా పోలీసుల సహకారంతో కొత్త బస్టాండ్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా అనుమానితుడు బస్సు నుంచి దిగుతున్నట్లు గుర్తించారు.

అనుమానితుడు మంత్రాలయ-గోకర్ణ బస్సు ఎక్కినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి బస్సు ఎక్కాడన్న విషయాన్ని అధికారులు మాత్రం వెల్లడించలేదు. బళ్లారికి చెందిన సీనియర్ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. “దయచేసి రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుపై ఎలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దు. అనుమానాస్పద వ్యక్తి బస్సులో బళ్లారికి వెళ్లి బళ్లారి బస్టాండ్‌లో మరో బస్సు ఎక్కినట్లు గుర్తించారు. బుధవారం రాత్రి ఫుటేజీని పరిశీలించాం. అసత్య ప్రచారాలు చేయకండి” అని తెలిపారు. నిందితుడికి సంబంధించిన కొత్త చిత్రాలేవీ ఎన్‌ఐఏ అధికారులు ఇంకా విడుదల చేయలేదు.
అనుమానాస్పద బాంబర్ ప్రయాణించిన BMTC బస్సు CCTV ఫుటేజ్‌లో అనుమానితుడు కెమెరా నిఘా నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుంది. కేఫ్ నుండి నిష్క్రమించిన తర్వాత, అనుమానితుడు మార్చి 1వ తేదీ ఉదయం 11.42 గంటలకు ITPL ప్రధాన రహదారిపై KA-01-F-4517 నంబర్ బస్సు ఎక్కాడు. ముందు తలుపు నుండి బస్సులోకి ప్రవేశించిన తర్వాత అనుమానితుడు మధ్య సీట్లకు నడుచుకుంటూ వెళ్లి.. అతను వెనక్కి తిరిగి సీసీటీవీ కెమెరాను చూశాడు. వెంటనే కెమెరా నిఘా లేని ముందు సీట్ల వద్దకు వెళ్లి తన ప్రయాణం కొనసాగించాడు.


Tags:    

Similar News