41 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
నామినేషన్ల గడువు ఉపసంహరణ గడువు ముగియడంతో 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.
రాజ్యసభ స్థానాలు 41 ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల గడువు ఉపసంహరణ గడువు ముగియడంతో మొత్తం 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. మొత్తం 15 రాష్ట్రాల్లో 57 స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 41 ఏకగ్రీవం కాగా, మరికొన్ని చోట్ల ఎన్నిక జరగాల్సి ఉంది. బీజేపీ ఈ 41 స్థానాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.
అత్యధికంగా.....
41 స్థానాల్లో బీజేపీకి చెందిన 14 మంది సభ్యులు రాజ్యసభకు ఏకగ్రీవం కాగా, కాంగ్రెస్, వైసీపీ నుంచి నలుగురు, బిజూ జనతాదళ్, డీఎంకే నుంచి ముగ్గురు, టీఆర్ఎస్, ఆర్జేడీ, ఆప్, అన్నాడీఎంకే నుంచి ఇద్దరు, జేఎంఎం, జేడూయ, ఎస్పీ, ఆర్ఎల్డీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ లకు చెందిన ముఖ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కపిల్ సిబాల్ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. మిగిలిన స్థానాలకు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి.