భారత్ కి అల్లుడైతే ఇన్ని తిప్పలా

భారత్ బ్రిటన్ దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం ఒకటి పెండింగ్‌లో ఉంది. ఇరు దేశాల ఆర్ధిక అభివృద్ధి కోసం బ్రిటన్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ డీల్‌ పై ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునక్ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు.

Update: 2023-09-13 10:58 GMT

రిషి సునాక్ కేం తో ఇండియా ఆన్ అకౌంట్ అఫ్ G20

భారత్ బ్రిటన్ దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం ఒకటి పెండింగ్‌లో ఉంది. ఇరు దేశాల ఆర్ధిక అభివృద్ధి కోసం బ్రిటన్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ డీల్‌ పై ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునక్ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నాటి నుండి రిషి పై ఆ దేశస్తుల విమర్షలు మిన్నంటుతున్నాయి‌. ఏం చేసావ్ సునక్ ఏమ్ చేయగలుగుతావు సునక్ అంటూ ఆంగ్లేయులు రిషి పై విమర్షల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన జీ 20 సమ్మిట్‌లో ఫ్రీట్రేడ్ ఒప్పందం పై చర్చలు జరుగుతాయన్న ఆశతో రిషి భారత్ లోకి కాలుపెట్టారు. కానీ ఆ సమ్మిట్‌లో రిషి సునక్‌కు చుక్కెదురైందనే చెప్పుకోవాలి. బ్రిటన్ ప్రధాని అయిన మన దేశపు అల్లుడికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందనే ఆశతో వచ్చిన రిషి..ని ప్రధాని నరేంద్ర మోడీ రెండురోజు అఫిషియల్ మీట్‌లో మాత్రమే కలిసారు. మొదటి రోజు మోడీ ఇంటిలో ఆతిథ్యానికి పిలుస్తారేమో అనుకున్న అతని ఆశలు నీరుగారిపోయాయి. సమిట్‌కి ముందురోజు మోడీ కేవలం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని మాత్రమే తన ఇంట్లో కలిసాడు.

జీ 20 సమిట్ సమయంలో తన ఉనికిని ప్రదర్శించడానికి రిషి సునక్ చాలా ప్రయత్నాలు చేశారు. ఎదురుచూసిన మొదటిరోజు మీటింగ్ జరగని కారణంతో.. రిషి సునక్ అటెన్షన్ కోసం చేయని ప్రయత్నం లేదు. గుళ్ళూ, పురాతన భవనాల చుట్టూ తిరుగుతూ ఇండియా అల్లుడు అనిపించుకునే ఫొటోషూట్లకు పూనుకున్నాడు. మోడీ మాత్రం జీ20 షెడ్యూల్ ప్రకారంగా కలవాల్సిన రెండోరోజు సమయానికే రిషి ని కలిసారు. కానీ ఆ సందర్భంలో ఫ్రీ ట్రేడ్ చర్చ జరగలేదు అని తెలుస్తోంది.
రిషి సునక్‌కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా కీలకమైనది. ఈసారి జరగకపోయినా.. వచ్చే నెల భారత్ లో జరగనున్న ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో ఇండియా, ఇంగ్లెండ్ మ్యాచ్ కోసం అతను ఇక్కడికి రానున్నారు. ఆలోపు ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు జరిగి ఫలించాలని అతను ఎదురుచూస్తున్నారు.


Tags:    

Similar News