ఇస్రో సరికొత్త రికార్డు.. రాకెట్ ప్రయోగం సక్సెస్
శ్రీహరికోటలో జరిగిన రాకెట్ ప్రయోగం విజయవంతమయింది. సక్సెస్ ఫుల్ sslv -d2 రాక్యెట్ నింగిలోకి దూసుకువెళ్లింది
శ్రీహరికోటలో జరిగిన రాకెట్ ప్రయోగం విజయవంతమయింది. సక్సెస్ ఫుల్ sslv -d2 రాక్యెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కేవలం 13 నిమిషాల్లోనే రాకెట్ అనుకున్న లక్ష్యానికి చేరుకుంది. దీంతో ఇస్రో చరిత్రలో మరో రికార్డు సృష్టించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రాకెట్ సక్సెస్ గా లక్ష్యానికి చేరుకోవడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేవు.
మూడు ఉపగ్రహాలను...
మూడు ఉపగ్రహాలను కక్షలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. ఈవోఎస్-07, 8.7 కిలోల బరువున్న ఆజాదీ శాట్ - 02 ఉపగ్రహంతో పాటు అమెరికాలోని అంటారిస్ సంస్థలకు చెందని 11.5 కిలోల బరువుగల జానూస్ - 01 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని పలువురు ప్రశంసించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.