నేడు ఇస్రో మరో ప్రయోగం

ఇస్రో సిద్ధం చేసిన రాకెట్ మరికాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.

Update: 2023-02-10 03:36 GMT

ఇస్రో సిద్ధం చేసిన రాకెట్ మరికాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. సరిగ్గా 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్‌వీ డీ2 రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లనుంది. తెల్లవారు జాము నుంచే దీనికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రారంభమయింది. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఎస్ఎస్ఎల్‌వీ డీ2 రాకెట్ ప్రయోగం జరగనుంది.

మరో రికార్డు...
ఈ రాకెట్ బరువు 156.3 కిలోలు. ఈవోఎస్-07, 8.7 కిలోల బరువున్న ఆజాదీ శాట్ - 02 ఉపగ్రహంతో పాటు అమెరికాలోని అంటారిస్ సంస్థలకు చెందని 11.5 కిలోల బరువుగల జానూస్ - 01 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించిన దేశంగా ఇస్రో సరికొత్త రికార్డును సృష్టించనుందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News