Ayodhya : అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ

అయోధ్య రామమందిరంలోని గర్భగుడిలో పైకప్పు లీకేజీ అవుతుంది. నీరు కారుతుంది

Update: 2024-06-25 01:27 GMT

అయోధ్య రామమందిరంలోని గర్భగుడిలో పైకప్పు లీకేజీ అవుతుంది. నీరు కారుతుంది. ఆలయం ప్రారంభించిన తర్వాత తొలిసారి అయోధ్యలో నిన్న రాత్రి భారీ వర్షం కురియడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గర్భగుడి పైకప్పు నుంచి నీరు లీకవుతున్న విషయాన్ని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. వర్షపు నీరు కురుస్తుండటంతో ఆలయ నిర్మాణంపై పూజారి పెదవి విరిచారు. బాల రాముడి విగ్రహానికి ఎదురుగా, ఆలయ పూజారి కూర్చునే చోటు వర్షపు నీరు పడుతుందని తెలిపారు.

వెంటనే మరమ్మతులు చేయాలని...
ఇక్కడ వీఐపీలు కూడా పూజలు చేసుకుని దర్శనం చేసుకుంటారని ఆయన తెలిపారు. ఆలయ నిర్మాణంలో లోపాలను నిన్న రాత్రి కురిసిన వర్షానికి గుర్తించామని పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు. అయితే ఈ సంగతి తెలుసుకున్న ఆలయ కమిటీ వెంటనే మరమ్మతులు చేయాల్సిందిా ఆదేశించారు. అయోధ్యలోని రామాలయం మొదటి అంతస్థు పనులు జులై చివరి నాటికి, మొత్తం ఆలయం నిర్మాణ పనులు డిసెంబరు నాటికి పూర్తవుతాయని ఆయన తెలిపారు.


Tags:    

Similar News