కప్పు టీ రూ.6, సమోసా రూ.6.. బ్రేక్ ఫాస్ట్ రూ. 37.. ఏంటో మీరే చూడండి !

కప్పు టీ రూ.6, సమోసా రూ.6.. బ్రేక్ ఫాస్ట్ రూ. 37, పూలదండ రూ.16.. ఏంటీ ధరలు ? అనుకుంటున్నారా. మరేం లేదు..

Update: 2022-01-19 07:46 GMT

కప్పు టీ రూ.6, సమోసా రూ.6.. బ్రేక్ ఫాస్ట్ రూ. 37, పూలదండ రూ.16.. ఏంటీ ధరలు ? అనుకుంటున్నారా. మరేం లేదు.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి ధరల పట్టికను విడుదల చేశారు లక్నో జిల్లా ఎలక్షన్ అధికారి. దాని ప్రకారం అక్కడ నిర్ణయించిన ధరలివి. ఒక కప్పు టీ రూ.6, ఒక సమోసా రూ.6గా ఈసీ నిర్ణయించింది. అలాగే, నాలుగు పూరీలు, ఒక స్వీట్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ ధరను రూ.37గా ఖరారు చేసింది.

అలాగే ఎంఆర్ పీ ధరపై మినరల్ వాటర్ ను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ఇక అభ్యర్థుల మెడలో వేసే పూలదండకు రూ.16, డప్పులు వాయించే ముగ్గురికి రోజుకు రూ.1575 ఇవ్వచ్చని పేర్కొంది. అలాగే.. కార్లను అద్దెకు తీసుకుంటే.. బీఎండబ్ల్యూ, మెర్సెడెజ్ అయితే నిత్యం రూ.21,000, పజెరో స్పోర్ట్ కు రూ.12,600, ఇన్నోవా, ఫార్చ్యూనర్, క్వాలిస్ కు రూ.2,310 చొప్పున రోజువారీ ఖర్చు పెట్టుకోవచ్చు.
ఎన్నికలు అనగానే.. అభ్యర్థులు ప్రచారం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయడం తెలిసిందే. అయితే దానికొక పరిమితిని నిర్ణయిస్తుంది ఈసీ. యూపీలో ఒక్కో అభ్యర్థి గరిష్టంగా రూ.40 లక్షలు మించి ఖర్చు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది అక్కడి ఎన్నికల కమిషన్. అభ్యర్థులు తమ ప్రచారానికి ఎంత ఖర్చు చేస్తున్నారన్న వివరాలను తప్పనిసరిగా ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థుల ఆర్థిక పరిస్థితులు వారి గెలుపు, ఓటములను ప్రభావితం చేయరాదన్నది ఈ నిబంధన ఉద్దేశ్యం.


Tags:    

Similar News