కేరళలో రెండో మంకీపాక్స్ కేసు
కేరళలో రెండో మంకీపాక్స్ కేసు నమోదయింది. దుబాయ్ వచ్చిన 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయింది.
కేరళలో రెండో మంకీపాక్స్ కేసు నమోదయింది. దుబాయ్ వచ్చిన 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కేరళ వైద్య ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి శరీరంపై దుద్దుర్లు రావడంతో అనుమానించిన వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. అతనికి మంకీపాక్స్ గా నిర్ధారణ కావడంతో పరియారం మెడికల్ కళాశాలలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఐసొలేషన్ కు....
కేరళలో మంకీపాక్స్ సోకిన విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి ధృవీకరించారు. వైరస్ సోకిన వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. అతనితో కాంటాక్ట్ అయిన వారిని కూడా ఐసొలేషన్ లో ఉంచారు. వారి రక్తనమూనాలను కూడా పరీక్షలకు పంపారు. భారత్ లో తొలి మంకీపాక్స్ కేసు కేరళలోనే నమోదయింది. రెండో కేసు కూడా అదే రాష్ట్రంలో రెండో కేసు కూడా నమోదు కావడం విశేషం.