గుజరాత్ లో ముగిసిన పోలింగ్.. నిరాసక్తత ఎందుకు?
ముగిసిన రెండో విడత గుజరాత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 58 శాతం పోలింగ్ జరిగింది
ముగిసిన రెండో విడత గుజరాత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 58 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 93 శాసనసభ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో గుజరాత్ ఎన్నిలకు ప్రశాంతంగా ముగిసింది. మందకొడిగా ఓటింగ్ శాతం నమోదయింది. తొలి విడతలో 89 శాసనసభ స్థానాల్లో జరిగిన పోలింగ్ లో 60. 2 శాతం ఓటింగ్ శాతం నమోదయింది.
ఎవరికి నష్టం?
తక్కువ శాతం ఓటింగ్ పోలవ్వడం ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అన్న చర్చ జరుగుతోంది. ఎటూ బీజేపీ గెలుస్తుందన్న నిరాసక్తతోనే ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అయితే నిశ్శబ్ద విప్లవంగానే భావించాలని, ఓటు వేయాలనుకున్న వారు వచ్చి తాము అనుకున్న పార్టీకి ఓటు వేశారని, ఎమ్మెల్యేలపై అసంతృప్తి కారణంగానే పోలింగ్ కు దూరంగా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.