ప్రమాదంలో దేశ లౌకికతత్వం
దేశ లౌకికతత్వం ప్రమాదం లో పడిందని, దేశ ఐక్యత, సమగ్రత దెబ్బతింటోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రధాని మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రధానిగా ఎన్నికైనప్పుడు రాజ్యాంగమే తన వేదమని, పార్లమెంటు వద్ద మోకరిల్లారని ఆయన గుర్తు చేశారు.
ప్రమాదంలో దేశ లౌకికతత్వం
దేశ లౌకికతత్వం ప్రమాదం లో పడిందని, దేశ ఐక్యత, సమగ్రత దెబ్బతింటోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రధాని మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రధానిగా ఎన్నికైనప్పుడు రాజ్యాంగమే తన వేదమని, పార్లమెంటు వద్ద మోకరిల్లారని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, ప్రజలు దీనిని అడ్డుకోవాలని ఆయన కోరారు. కేరళ మీడియా అకాడమీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ ఏకత్వం, బహుళత్వం, లౌకకతత్వం దెబ్బతింటోందని సామాజిక న్యాయం అడుగంటుతోందని తద్వార దేశాన్ని బీజేపీ అధినాయకత్వం నాశనం చేయాలనుకుంటుందన్నారు. మనమంతా కలసి దీనిని ఎదుర్కోవాలని డీఎంకే అధినేత పిలుపు నిచ్చారు. కొంతమందికి ద్రావిడజం అంటేనే చిరాకు వస్తుందని, తమిళనాడు, కేరళ ప్రజలమైన మనమంతా ద్రవిళ కుటుంబానికి చెందినవారమన్నారు. భారత దేశాన్ని రక్షించుకునేందుకు డబుల్ బ్యారెల్ గన్నుల్లా రెండు రాష్ట్రాల ప్రజలు పనిచేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.