Lk Advani : అపోలో ఆసుపత్రిలో చేరిన ఎల్‌కే అద్వానీ
బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తిరిగి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు;
బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తిరిగి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇటీవల అద్వానీకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్చారు. చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తిరిగి ఆయన అస్వస్థతకు గురి కావడంతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు.
వైద్యుల పర్యవేక్షణలో...
రాత్రి నుంచి వైద్యులు అద్వానీ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని, అద్వానీ ఆరోగ్య పరిస్థిితి నిలకడగానే ఉందని అపోలో ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. వృద్ధాప్యం ద్వారా వచ్చే సమస్యలతో అద్వానీ గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయనకు అన్ని పరీక్షలు చేస్తున్నారు.