సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతి

టాటా గ్రూపు మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు

Update: 2022-09-04 12:18 GMT

టాటా గ్రూపు మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన తన కారులో అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని పాల్టర్ జిల్లాలో సూర్య నది వంతెనపై ఈ దుర్ఘటన జరిగింది. వంతెనపై ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడంతో సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీతో పాటు కారులో ఉన్న మరొకరు కూడా మరణించారు. అత్యంత వేగంతో కారు డివైడర్ ను ఢీకొట్టడంతోనే మృతి చెందారు.

ప్రస్తుతం పల్గొంజీ గ్రూపు ఛైర్మన్ గా...
సైరస్ మిస్త్రీ ప్రస్తుతం షాపూర్ జీ - పల్గొంజీ గ్రూపు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. వ్యాపార దిగ్గజం పల్గొంజీ తనయుడు సైరస్ మిస్త్రీ, ఆయన 1968 జులై 4 జన్మించారు. రతన్ టాటాతో విభేదించి ఆయన బయటకు వచ్చి పల్గొంజీ గ్రూపు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సైరస్ మిస్త్రీ మరణంతో వ్యాపార వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు వాణిజ్య ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.


Tags:    

Similar News