Landslides : సిక్కింలో కొండ చరియలు విరిగిపడి ఆరుగురి మృతి

సిక్కింలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు పడటంతో ఆరుగురు మరణించారు.

Update: 2024-06-14 05:54 GMT

సిక్కింలో కుండపోత వర్షాలు ఆరుగురి ప్రాణాలను బలి గొన్నాయి. ఉత్తర సిక్కింలోని మంగన్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు పడటంతో ఆరుగురు మరణించారు. ఈ కొండచరియల కింద దాదాపు పదిహేను వేల మంది పర్యాటకులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. సంగ్‌కలాంగ్ లో నూతనంగా నిర్మించిన వంతెన కూలిపోయింది. దీంతో మంగన్‌కు దోంగ్, చుంగ్ తాంగ్ లతో సంబంధాలు తెగిపోయాయి.

సంబంధాలు తెగిపోవడంతో...
కొండచరియలు విరిగి పడటంతో రోడ్లన్నీ మూసుకుపోయి వెళ్లేందుకు కూడా దారి లేదు. భారీ వర్షాలకు అనేక ఇళ్లు నీట మునిగాయి. వందల సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో యుద్ధ ప్రాతిపదికపైన సహాయక చర్యలతో పాటు విద్యుత్తును పునరుద్ధించే కార్యక్రమాలను అధికార యంత్రాంగం చేపట్టింది.


Tags:    

Similar News