భారత్ లో ఈరోజు కరోనా కేసులు ఎన్నంటే?

ఇప్పటి వరకూ భారత్ లో 5,28,273 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 46,748 ఉన్నాయి

Update: 2022-09-16 05:29 GMT

భారత్ లో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. ఒక్కరోజులో 6,298 మంది కరోనా బారిన పడ్డారు. 23 మంది కరోనా కారణంగా మరణించారు. ఒక్కరోజులో 5,916 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.71 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 0. 0 శాతం నమోదయింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

యాక్టివ్ కేసులు...
దేశంలో ఇప్పటి వరకూ 4,45,22,777 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 4,39,47,756 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ భారత్ లో 5,28,273 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 46,748 ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 216.17 కోట్లకు చేరింది.


Tags:    

Similar News