201 కి.మీలకు చేరిన రాహుల్ పాదయాత్ర

ఇప్పటి వరకూ 201 కిలోమీటర్ల వరకూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. ఈరోజు రాత్రికి అరవకాడులో 11వ రోజు పాదయాత్ర ఆగనుంది;

Update: 2022-09-18 04:07 GMT
201 కి.మీలకు చేరిన రాహుల్ పాదయాత్ర
  • whatsapp icon

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కేరళలో కొనసాగుతుంది. ఈరోజు హరిపద్ నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. రోజుకు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. పురుక్కాడ్ వద్ద లంచ్ బ్రేక్ కు ఆగుతారు. అనంతరం బయలుదేరి ఈరోజు రాత్రికి అరవకాడులో 11వ రోజు పాదయాత్ర ఆగనుంది. ఇప్పటి వరకూ 201 కిలోమీటర్ల వరకూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు.

మమేకమవుతూ....
కేరళలో రాహుల్ గాంధీకి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలి వచ్చి రాహుల్ గాంధీ పాదయాత్రకు సంఘీభావాన్ని తెలుపుతున్నారు. రాహుల్ కూడా అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రాహుల్ వెంట కేరళ రాష్ట్రానికి చెందిన నేతలే కాకుండా ఇతర రాష్ట్రాల నేతలు కూడా పాల్గొంటున్నారు. ఈ నెల 7వ తేదీన కన్యాకుమారిలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమయిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News