Trains Cancelled :ఈసారి రద్దయిన రైళ్లు ఇవే

భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరో పదహారు రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది

Update: 2024-09-05 03:41 GMT

భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. తాజాగా మరో పదహారు రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలతో రైళ్లను రద్దు చేస్తుననట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటంచింది. కొన్ని రైళ్లను మళ్లిస్తున్నట్లు కూడా అధికారులు తెలియ చేశారు. భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో నీరు చేరడంతో పాటు పట్టాలపైకి నీరు రావడంతో రైళ్ల రాకపోకలపై ఈ ప్రభావం పడింది.

మొత్తం రైళ్లను...
తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లను ఏ రోజుకారోజు రద్దు చేేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి వరకూ 594 రైళ్లను రద్దు చేసింది. పదిహేను రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ లు సిద్ధం కావడంతో ఎనిమిది రైళ్లు పునఃప్రారంభం అయినట్లు తెలిపింది. అలాగే మరో నాలుగు రైళ్ల రాకపోకలు యధాతధంగా కొనసాగుతాయని పేర్కొంది.


Tags:    

Similar News