అరుదైన రికార్డు సాధించిన దక్షిణ మధ్య రైల్వే
సరుకు రవాణాలో 112.51 మిలియన్ టన్నుల లోడిరగ్ నిర్వహించడం ద్వారా రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
న్యూ ఢిల్లీ : దక్షిణమధ్య రైల్వే అరుదైన రికార్డు సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకూ (2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 17వ తేదీ వరకు) సరుకు రవాణాలో 112.51 మిలియన్ టన్నుల లోడిరగ్ నిర్వహించడం ద్వారా రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ.. అన్ని రకాల సరుకుల లోడిరగ్ అధిక స్థాయిలో జరగడంతో దక్షిణమధ్య రైల్వే అన్ని రంగాల్లో సరుకు రవాణాలో వృద్ధి సాధించింది.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 17.7 శాతం అధిక ఆదాయం వచ్చింది. అరుదైన రికార్డు సాధించిన సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ మాట్లాడుతూ.. సరుకు రవాణా రంగంలో మెరుగైన రికార్డులను నమోదు చేయడం, రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడంలో అంకిత భావంతో కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వే బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.