Loksabha : లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లు...టీడీపీ మద్దతు

లోక్ సభలో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టారు.

Update: 2024-12-17 07:04 GMT

లోక్ సభలో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించింది. ఇప్పటికే లోక్ సభలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ సభ్యులు సభకు తప్పకుండా హాజరు కావాలని విప్ జారీ చేశాయి.


విపక్షాల నిరసన...

జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లుపై వివిధ పార్టీల నేతల అభిప్రాయాలను స్పీకర్ ఓం బిర్లా తెలుసుకుంటున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఈ బిల్లు దెబ్బతీస్తుందని కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ అన్నారు. బిల్లును కాంగ్రెస్, తృణమూల్, సమాజ్ వాదీ పార్టీలు వ్యతిరేకిస్తూ సభలో తన అభిప్రాయాన్ని తెలియజేశాయి. బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసన తెలియజేశాయి. తెలుగుదేశం పార్టీ మాత్రం బిల్లును సమర్ధిస్తున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు



Tags:    

Similar News