ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే?

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే గత ఎన్నికల షెడ్యూల్ కంటే నాలుగు రోజులు ఆలస్యమయింది;

Update: 2024-03-14 04:53 GMT
lok sabha election, schedule, election commssion, india
  • whatsapp icon

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే గత ఎన్నికల కంటే నాలుగు రోజులు షెడ్యూల్ విడుదల కావడం ఆలస్యమయింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు మూడు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. వాస్తవానికి ఈ నెల 14, 15 తేదీల్లో షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.

నియామకం పూర్తి కాకపోవడంతో...
కానీ కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో కొత్త కమిషనర్ల ఎంపికపై కసరత్తు జరుగుతుంది. ఈ ఎంపిక పూర్తయిన తర్వాత శనివారం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే ఆలస్యమయినందున ఇక జాప్యం చేసే అవకాశం లేదని ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News