హిజాబ్ వివాదం.. తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ అభిప్రాయపడ్డారు
హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ అభిప్రాయపడ్డారు. హిజాబ్ వివాదాన్ని జాతీయ అంశంగా మార్చే ప్రయత్నం చేయవద్దని ఆదేశించారు. ఇప్పటికిప్పుడు అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, కర్ణాటక హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాతనే విచారిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. దీంతో సుప్రీంకోర్టులో దాఖలైన అత్యవసర పిటీషన్ ను ఆయన తోసిపుచ్చారు.
హైకోర్టు తీర్పు వచ్చేంత వరకూ....
కర్ణాటక హైకోర్టు హిజాబ్ వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ఎటువంటి మతపరమైన వస్త్రధారణ చేయవద్దని, తుది తీర్పు వెలువడేంత వరకూ విద్యాసంస్థల్లో యూనిఫారం మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది. దీనిపై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అయితే కర్ణాటక హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై సవాలు చేస్తూ అత్యవసర విచారణను చేపట్టాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సీజేఐ దానిని తోసిపుచ్చారు.