తమిళనాడు గవర్నర్ రవిపై సుప్రీంకోర్టు అసహనం
తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది
తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగాన్ని అనుసరించడమంటే ఇలాగేనా? అంటూ ప్రశ్నించింది. నిర్దోషిగా తేలిన డీఎంకే నేతను మంత్రివర్గంలోకి తీసుకునే విషయంలో గవర్నర్ రవి నిరాకరించడాన్ని తప్పు పట్టింది. రేపటిలోగా నిర్ణయాన్ని ప్రకటించాలని పేర్కొంది. గవర్నర్ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డీఎంకే సీనియర్ నేత పొన్ముడికి జైలు శిక్ష నిలుపుదల చేయడంతో ఆయన మళ్లీ ఎమ్మెల్యే పదవిని దక్కించుకున్నారు.
రేపటి వరకూ గడువు...
దీంతో పొన్ముడిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవలని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రయత్నించారు. అయితే గవర్నర్ రవి అందుకు అంగీకరించలేదు. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈపిటీషన్ పై విచారించిన ధర్మానం రేపటి లోగా పొన్ముడిని మంత్రివర్గంలోకి తీసుకునే విషయంపై నిర్ణయాన్ని ప్రకటించాలని తెలిపింది. రేపు కూడా గవర్నర్ సుప్రీంకోర్టు ఆదేశాాలను అమలు పర్చకపోతే రాజ్యాంగ ప్రకారం వ్యవహరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.