Supreme Court : చైల్డ్ పోర్నోగ్రఫీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, డౌన్ లోడ్ చేయడం వంటివి నేరాలుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు చెప్పింది.
చైల్డ్ పోర్నోగ్రఫీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, డౌన్ లోడ్ చేయడం, అప్‌లోడ్ చేయడం వంటివి నేరాలుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు చెప్పింది. గతంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదన్న మద్రాస్ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా దీనిపై విచారించిన ధర్మాసనం ఈ తీర్పు నిచ్చింది.
ఆ పదాలను వాడొద్దు...
చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం పోక్సో చట్టం కింద నేరమేనని తెలిపింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఘోరమైన తప్పిదానికి మద్రాస్ హైకోర్టు పాల్పడిందని పేర్కొంది. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని మార్చాలని, చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్ అనే పదం అమలులోకి వచ్చేలా చట్టంలో సవరణలు తేవాలని, ఆ సవరణలు అమలులోకి వచ్చే వరకుూ ఆర్డినెన్స్ ను జారీ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.