Parliament : సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి.. మరో 49 మందిపై వేటు
పార్లమెంటు ఉభయ సభల్లో విపక్ష పార్టీల సభ్యుల సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఈరోజు లోక్‌సభలో మరో 49 మందిని సస్పెండ్ చేశారు
పార్లమెంటు ఉభయ సభల్లో విపక్ష పార్టీల సభ్యుల సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఈరోజు లోక్‌సభలో మరో 49 మంది పార్లమెంటు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఇప్పటి వరకూ ఉభయ సభల్లో సస్పెన్షన్ వేటు పడిన వారి సంఖ్య 140 దాటింది. పార్లమెంటులో జరిగిన దాడిపై విపక్షాలు ప్రశ్నించడంతో పాటు కేంద్ర హోం మంత్రి, ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వరస సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి.
పార్లమెంటుపై జరిగిన దాడి...
శీతాకాల సమావేశాల మొత్తాన్ని సస్పెండ్ చేశారు. మరోవైపు ఇండియా కూటమి కూడా సస్పెన్షన్లకు వ్యతిరేకంగా శీతాకాల సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించింది. అధికార పక్షం పార్లమెంటులో జరిగిన దాడిపై సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికే సస్పెన్షన్లను మార్గంగా ఎంచుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.