Breaking : సినీనటుడు విజయ్‌కాంత్ మృతి
తమిళ నటుడు విజయకాంత్ మరణించారు. ఆయన కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు.
తమిళ నటుడు విజయకాంత్ మరణించారు. ఆయన కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయకాంత్ సినిమారంగంలోనే కాకుండా రాజకీయరంగంలోనూ రాణించారు. తమిళనాడులో కెప్టెన్ గా ఆయనకు మంచి పేరుంది. ఆయన అసలు పేరు విజయరాజ్ అలగర్‌స్వామి. 1952 ఆగస్టు 25వ తేదీన జన్మించారు. ఆయన మృతిని తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో ఆయన మరణించారు. విజయ్‌కాంత్ వయసు డెబ్భయి సంవత్సరాలు.
శాసనసభ్యుడిగా...
విజయకాంత్ డీఎండీకే పార్టీని స్థాపించారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలలో గెలిచి 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నాయకునిగా భాద్యపనిచేశారు. సినీ హీరోగానే కాకుండా, నిర్మాత, దర్శకునిగా కూడా పనిచేశారు. ఆయనకు తమిళనాడు అంతటా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. విరుధాచలం, రిషివండియం నియోజకవర్గాల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. విజయ్‌కాంత్ అంత్యక్రియలను అధికారికంగా చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.