ఊపిరిపీల్చుకున్న చెన్నై
ప్రమాదం నుంచి చెన్నై నగరం బయటపడినట్లేనని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
మాండూస్ తుపాను కారణంగా చెన్నై నగరం భయంతో వణికిపోయింది. కొన్ని గంటల పాటు వర్ష బీభత్సం, ఈదురుగాలులతో ప్రజలు భయకంపితులయ్యారు. దాదాపు 190 వృక్షాలు కూలిపోయాయి. పదుల సంఖ్యలో విద్యుత్తు స్థంభాలు నేలకొరిగాయి. ఆస్తి నష్టం అంచనా వేయడానికి వీలు లేకుండా ఉంది. అనేక కార్లు చెట్లు కూలి ధ్వంసమయ్యాయి. ఈదురు గాలికి, వర్షాలనికి పలు ఇళ్లు నేల కూలాయి.
నష్టం అంచనాను...
ప్రమాదం నుంచి చెన్నై నగరం బయటపడినట్లేనని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. కూలిపోయిన చెట్లను కార్పొరేషన్ సిబ్బంది తొలగిస్తున్నారు. విద్యుత్తు స్థంభాలు నేలకొరగడంతో విద్యుత్తు శాఖ అధికారులు వాటిని తిరిగి ఏర్పాటు చేసి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. నష్టం అంచనాను వేసి అందరికీ నష్ట పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.